
ఆ కారణం చేత మెగాస్టార్, బాలయ్య బాబు ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసిన సాయిపల్లవి...!!
ఒకవేళ తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా రిజెక్ట్ చేసేస్తుంది. ఇలా సాయి పల్లవి గతంలో చాలా చిత్రాలను వదులుకుంది.ఈ లిస్ట్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉందండోయ్. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. వీర సింహా రెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో వరలక్ష్మి పోషించిన బాలయ్య చెల్లెలు క్యారెక్టర్ కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారట.కానీ, సిస్టర్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉన్నా కూడా సాయి పల్లవి మాత్రం ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిందట. ఇటువంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తనకు అస్సలు సూట్ కాదని భావించి ఆమె వదులుకుందట. దాంతో వరలక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె తన నటనా విశ్వరూపాన్ని చూపించింది.
బాలయ్యకు ధీటుగా నటించి మెప్పించింది. ఏదేమైనా సాయి పల్లవి ఈ రోల్ ను వదులుకోవడమే మంచిదైంది. ఒకవేళ చేసుంటే ఖచ్చితంగా పరువు పోయేది. ఎందుకంటే, ఇటువంటి క్యారెక్టర్స్ ఆమెకు అస్సలు సూట్ కావు. ఈ విషయం తెలుసు కాబట్టే సున్నితంగా సాయి పల్లవి వీర సింహా రెడ్డిని వదులుకుంది.ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా ఈమెని చెల్లే పాత్ర కోసం అడిగారు కానీ ఆమె ఆ పాత్ర ని చేయను అని చెప్పి రిజక్ట్ చేసింది.ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలకి షాక్ ఇచ్చిన హీరోయిన్ గా సాయి పల్లవి టాలీవుడ్ లో చాలా స్పెషల్ అని అనిపించుకుంది.