అనుష్క కి నాగశౌర్య పెళ్లికి అసలు సంబంధం ఏంటి.. షాక్ లో ఫ్యాన్స్..!?

Anilkumar
సోషల్ మీడియా వచ్చాక ఏ విషయం కూడా దాగడం లేదు.  అసలు ఏ హీరో ఏ మాటలో అన్నాడో కూడా అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అలా అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్దమో అని చెప్పలేము. నిజమని కూడా చెప్పలేము. సెలబ్రిటీస్ జీవితాల్లో జరగబోయే విషయాలను ముందుగా అభిమానులకి చేరవేసేది సోషల్ మీడియానే. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నాగశౌర్య కొన్ని కామెంట్స్ చేశాడు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పుడూ సినిమాలు చేస్తూ చాలా సైలెంట్ గా

 ఉంటూ తన పని తాను చేసుకుని వెళ్లిపోయిన నాగశౌర్య ఇటీవల రంగబలి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోని ఆ సినిమా ఊహించినంత హిట్ కాకపోవడంతో తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు నాగశౌర్య. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క శెట్టితో నాకు ఎఫైర్ ఉంది అంటూ ఆ వార్తలు రాయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ప్రకారం నాగశౌర్య మాట్లాడుతూ ఇప్పటికి ఇండస్ట్రీలో నేను చాలామంది

 హీరోయిన్స్ తో నటించాను. ఇప్పటికే నాకు పలానా హీరోయిన్స్ చాలా రాశారు ఒకసారి మాళవిక మరోసారి   రాశి ఖన్నా ఇలా చాలా వార్తలు నాపై రాశారు. కానీ ఇప్పుడు నాకు అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం ప్లీజ్ దయచేసి ఒక్కసారి నాకు ఆమె కి ఎఫైర్ ఉంది అని రాయగలరా అంటూ రిక్వెస్ట్ చేశారట నాగశౌర్య. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో నిజంగా నాగశౌర్య ఇలా చెప్పాడా లేదా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే  నాగశౌర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగశౌర్య భార్యకి అనుష్క శెట్టి ఫేవరెట్ హీరోయిన్ కావడంతో నాగశౌర్య ఆమెను పెళ్లి చేసుకున్నాడు అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: