ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పై భారీ ట్రోలింగ్.. అందుకేనా..?

Divya
ప్రస్తుత కాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ తాను నటిస్తున్న చిత్రాలపై అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఇలా ప్రతిసారి కూడా విమర్శల పాలవుతున్నారని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఆది పురుష్ సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ప్రభాస్ ఇప్పుడు ప్రాజెక్టుకే విషయంలో కూడా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ప్రాజెక్టు కే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమాకు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు అంటే నమ్మడం అసాధ్యం అనే చెప్పాలి. దీనిని చూసిన తర్వాత అమీర్పేట్ గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఉంది అని.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే హీనంగా ఉందని.. నాగ అశ్విన్ ను ఏదో ఊహించుకున్నాము కానీ ఇదేమి లుక్కు రా బాబు అంటూ రకరకాలుగా భారీ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.  హడావిడిగా ప్రాజెక్టుకే ఫస్ట్ లుక్ వదిలిన టీము ఇప్పుడు భారీగా ట్రోల్ ఎదుర్కొంటుందని చెప్పాలి. ఫస్ట్ లుక్ ఏమాత్రం ఆకట్టుకోలేదని సినిమా ప్రేమికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు చివరికి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఐరన్ మ్యాన్ సూట్ ధరించిన ప్రభాస్.. ఇందులో పొడవైన జుట్టుతో కనిపించారు. అది యాంగిల్ మిస్టేకా లేక మార్ఫింగ్ చేసి నిజంగానే వదిలారో తెలియదు కానీ బాడీకి.. ప్రభాస్ తలకు ఏమాత్రం సింక్ కాలేదు. అసలు ఫ్రాంక్ పోస్టర్ లా ఉంది అని .. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ముఖ్యం అదే పోయింది అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: