ఆ సినిమాల లిస్టులోకి బేబీ?

Purushottham Vinay
రీసెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు అన్ని కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. దానికి బలమైన కారణం కూడా ఉంది.జీరో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఆడియన్స్ చిన్న సినిమాలు చూసేటపుడు థియేటర్స్ కి వస్తారు.వారికి ఏ మాత్రం నచ్చినా ఇక మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది.గతంలో వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా 25 కోట్లు కొల్లగొట్టింది. ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రీసెంట్ గా శ్రీవిష్ణు సామజవరగమన చిత్రం కూడా అలాగే అంచనాలు లేకుండానే థియేటర్స్ లోకి రిలీజ్ అయ్యింది.అవుట్ అండ్ అవుట్ కామెడీ తో బొమ్మ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ను నవ్వించడం వల్ల ఈ మూవీకి కంప్లీట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో కలెక్షన్స్ రెండో రోజు నుంచి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో అమాంతం పెరిగిపోయాయి.ఈ సినిమా దాదాపు 50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.శ్రీవిష్ణు కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ఈ సామజవరగమన నిలిచింది.


ముఖ్యంగా ఈ సినిమాకు  ఫ్యామిలీ ఆడియెన్స్ గట్టిగా సపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కోవలోకి బేబీ మూవీ కూడా వస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. అయితే మొదటి రోజు నెగిటివ్ రివ్యూలు వచ్చిన యూత్ కి మాత్రం ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయ్యింది.దీంతో ఈ మూవీ మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్ అందుకుంది. ఇంకా అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ ఈ సినిమాని చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఈ రోజుల్లో యువతలో చాలా  మంది అబ్బాయిలు ఇలాంటి చేదు అనుభవాలను ఫేస్ చేస్తున్నవారే. ప్రేమలో మోసపోయిన వారు ఫీల్ అవుతుంటే.. సింగిల్ లా ఉండేవారు మాత్రం మరోలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా యువతకు కావాల్సిన పాయింట్ తో సాయి రాజేష్ చాలా గట్టిగానే ఎట్రాక్ట్ చేశాడు.ఇక వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: