జైలర్: టైటిల్ చేంజ్ చేస్తున్నారా?

Purushottham Vinay
ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు పెద్ద పెద్ద టాప్ హీరోలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సినిమాలలో నటించి పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రజనీకాంత్.ఇప్పటికీ ఈ వయసులో కూడా అదే ఊపుని కొనసాగిస్తూ వరుస సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ నేటి ప్రేక్షకులకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఒక సినిమా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడ్ గా దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ సినిమా ఆగస్టు 10న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా టైటిల్ పై కోర్టులో పిటీషన్ ని దాఖలు చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ మాది అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు.

మలయాళ ప్రొడ్యూసర్ ఎన్.కె మొహమ్మద్ నిర్మించిన పీరియాడికల్ డ్రామా 'జైలర్'. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ తోనే ఇప్పుడు రజినీకాంత్ సినిమా కూడా రాబోతుంది. అయితే ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ ఈ మూవీ ఆర్ధిక సమస్యల వల్ల సినిమా ఆగిపోయింది.అయితే ఇప్పుడు ఇదే మూవీ టైటిల్ తో సూపర్ స్టార్ సినిమా రావడంతో పెద్ద వివాదం మొదలైంది. అందుకే మేకర్స్ ఈ మూవీ టైటిల్ ని మార్చే పనిలో ఉన్నారని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుంచి ఓ రెండు పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. గత కొంత కాలంగా వరుస ప్లాపులు అందుకుంటున్న రజినీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: