మద్యం నా జీవితాన్ని నాశనం చేసింది : హీరోయిన్

praveen
బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మనీషా కోయిరాల గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే అప్పట్లో స్టార్ హీరోయిన్గా మనిషా కొయిరాల హవా నడిపించింది. తన అందం అభినయం తో కుర్రకారును పగటి కలల్లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.


  ఆ తర్వాత కాలం లో వైవిధ్యమైన పాత్రలు కూడా చేసి నటిగా తన సత్తా ఏంటో నిరూపించుకుంది మనిషా కొయిరాలా. ఇక గ్లామర్ పాత్రల్లో నటించడం విషయం లో  ఆమెను మించిన వారు లేరు అనటంలో  సందేహం లేదు అని చెప్పాలి. అలాంటి మనీషా కోయిరాలా తర్వాత కాలం లో మాత్రం కెరియర్ను పూర్తిగా నాశనం చేసుకుంది. ఇక క్రమక్రమం గా ఆమెకు అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి మొత్తం దూరం అయి పోయింది. అయితే  తన కెరియర్ తన చేతులారా నాశనం చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మనిషా కొయిరాలా.


 మద్యపానం కారణం గానే తన జీవితం మొత్తం తలకిందులు అయింది అంటూ చెప్పుకొచ్చింది. మద్యం అలవాటు కావడం కారణం గా ఎంతో ఇబ్బంది పడ్డాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చింది. ఇలా మద్యానికి బానిసగా మారిన తర్వాత ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది. అయితే గతంలో మనిషా కొయిరాల మధ్య మత్తు లో హల్చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ క్యాన్సర్ బారిన పడింది. ఇక ప్రస్తుతం క్యాన్సర్ ను జయించి మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది అని చెప్పాలి. కాగా మనిషా కొయిరాలా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: