వార్నీ.. నాగచైతన్య అంత రిస్క్ చేస్తున్నాడా?

praveen
అక్కినేని హీరో నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొద్దో గొప్పో నిలదొక్కుకున్న హీరో నాగచైతన్య. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతను చేసిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. ఇక నాగచైతన్య మాత్రం పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే మొన్నటికి మొన్న కస్టడీ అనే సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య.. సూపర్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకున్నాడు.


 అయితే ఇప్పుడు నాగచైతన్య ఒక సినిమా గురించి గట్టిగానే రిస్క్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. వీరిద్దరూ విడాకులు తీసుకొని నెలలు గడుస్తున్న వీరి విడాకుల అంశం మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విడాకుల అంశాన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నాగ చైతన్యకు వచ్చిందట. ఈ క్రమంలోనే ఆ టాపిక్ ను బేస్ చేసుకుని సినిమా తీయాలని అనుకుంటున్నాడట. ఇలా చేస్తే సినిమాకు బోలెడు పబ్లిసిటీ వస్తుందని నాగ చైతన్య భావిస్తున్నాడట.


 ఈ క్రమంలోనే నాగచైతన్య తన నెక్స్ట్ మూవీ కథ మొత్తం ఇక విడాకులకు సంబంధించిన పాయింట్ చూస్తూనే తిరుగుతుందని.. ఒక టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం చందు మొండేటితో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. తాండెల్ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం శ్రీకాకుళం నేపథ్యంలో ఉండబోతుందట. ఇక ఈ సినిమాతో పాటు సామజవరగమన దర్శకుడు తో ఒక సినిమా కమిట్ అయ్యాడు ఈ అక్కినేని హీరో. అయితే నాగచైతన్య అనుకుంటున్న విడాకుల నేపథ్యంలో సినిమాకు మాత్రం దర్శకుడు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: