ఆ హీరోతో.. రొమాన్స్ చేయాలని ఉంది : కాజోల్
ఇటీవల కాలంలో ఇలా సినిమా ప్రమోషన్స్ లో ఎంతో మంది రిపోర్టర్లు షాకింగ్ ప్రశ్నలు అడగడం.. ఇక సినీ సెలబ్రిటీలు అంతకుమించిన షాకింగ్ సమాధానాలు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ది ట్రయల్ ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ హీరోయిన్ కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ హీరోతో మళ్ళీ రొమాంటిక్ సాంగ్ చేస్తే బాగుండు అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది కాజోల్. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.
తనకు హీరో షారుక్ ఖాన్ తో మంచి స్నేహం ఉందని.. ఆయనతో మళ్ళీ ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలని ఉంది అంటూ కాజోల్ మనసులో ఉన్న మాటను బయట పెట్టింది. అదే సమయంలో ఇక షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. పఠాన్ సినిమా గురించి షారుక్ ఖాన్ ఏమైనా అడగాలనుకుంటే ఏమడుగుతారు అంటూ ప్రశ్నించగా.. పఠాన్ సినిమా గురించి చెప్పిన కలెక్షన్స్ నిజమేనా.. అసలు కలెక్షన్స్ ఎంత అని అడుగుతాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పింది. దీంతో పఠాన్ సినిమా కలెక్షన్స్ నిజం కాదా అంటూ షారుక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.