వైష్ణవి చైతన్య ను వెంటాడుతున్న పాయల్ రాజ్ పుత్ అనుభవాలు !

Seetha Sailaja
ఆనంద దేవరకొండ వైష్ణవి నటించిన ‘బేబి’ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఆమూవీ ఫెయిల్ అవుతుందని అంతా భావించారు. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఏఏమూవీకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈసినిమా టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ బాగా ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


ఈసినిమాకు తెలుగు రాష్ట్రాలలోని చాల సెంటర్స్ లో ఈ వీకెండ్ కలక్షన్స్ బాగా రావడంతో ఆనంద దేవరకొండ కెరియర్ లో ఒక హిట్ పడినట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే యూత్ మాత్రం ఆనంద్ దేవరకొండ గురించి కాకుండా ఎక్కువగా వైష్ణవి గురించి మాట్లాడు కుంటున్నారు. గతంలో ‘ఆర్ ఎక్స్ 100’ విడుదల అయిన తరువాత జనం పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు చాలామంది వైష్ణవి గురించి మాట్లాడుకుంటున్నారు.  


సోషల్ మీడియాలో ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న వేషాల నుంచి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా మారింది వైష్ణవి. ఈమూవీలో ఆమె చేసిన బొల్డ్ యాక్టింగ్ కు ఎక్కువ పేరు రావడంతో భవిష్యత్ లో ఇలాంటి పాత్రలు ఆమెకు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అవకాశాలు వస్తున్నాయి కదా అని వరసపెట్టి ఇలాంటి సినిమాలను ఆమె ఒప్పుకుంటే ఇలాంటి నెగిటివ్ ఇమేజ్ ఉన్న పాత్రలతో ఆమె కెరియర్ దెబ్బతిని గతంలో పాయల్ రాజ్ పుత్ కు ఎదురైన అనుభవాలు వైష్ణవికి కూడ ఎదురయ్యే ఆస్కారం ఉంది అంటూ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.  


దీనితో వైష్ణవి తన పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే కెరియర్ నష్టపోయే ఆస్కారం ఉంది అంటూ మరికొందరు ఆమెకు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈమెకు గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఆస్కారం ఇప్పట్లో రాకపోవచ్చని ఏదైనా ఊహించని బ్లాక్ బష్టర్ వస్తే మాత్రం ఈమె పై స్టార్ హీరోల దృష్టిపడే ఆస్కారం ఉంది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: