ఈరోజు తెలుగు సినిమా షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ సినిమాలు ఏవి ... అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బి హెచ్ ఈ ఎల్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

టైగర్ నాగేశ్వరరావు : రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రవితేజ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

డబల్ ఈస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రామ్ పోతినేని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందుతుంది. ఈస్మార్ట్ శంకర్ మూవీ లో రామ్ పోతినేని హీరోగా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నిధి అగర్వాల్ ... నబా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: