టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారుతున్న హేషం అబ్దుల్ హవాబ్..!!

Divya
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. హేషం అబ్దుల్ హవాబ్. టాలీవుడ్ లో క్లాస్ సినిమాలకు మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ సినిమాలు మాస్ సినిమాలు వంటివి వరుసగా విడుదల అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్లాస్ సినిమాల విజయాలకు కీలకంగా కథనాలతో పాటు మ్యూజిక్ కూడా ఆయోపట్టుగా మారేలా కనిపిస్తోంది
రీసెంట్గా వచ్చిన దసరా, సార్, సామజవరగమన వంటి చిత్రాలకు మంచి పాపులారిటీ లభించింది.



సౌదీకి చెందిన ఇతను మలయాళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలుగుతున్నారు అక్కడి నుంచి మెలోడీ మ్యూజిక్కు అబ్దుల్ కేరాఫ్ అడ్రస్ గా మారారు. మధురం ,హృదయం వంటి సినిమాలలో మంచి క్రేజీ సంపాదించుకున్న అబ్దుల్ ఈ ఏడాది ఖుషి చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చిన రెండు మూడు నెలలకే దాదాపుగా టాలీవుడ్ లో వరుస అవకాశాలు వెళ్ళబడ్డాయి.. ఇక రీసెంట్ గా నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాకు కూడా అవకాశాన్ని అందుకున్నారు హేషం అబ్దుల్ హవాబ్.

అలాగే ఈ శర్వానంద్ నటిస్తున్న 35 చిత్రానికి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు ఇక అంతేకాకుండా త్వరలో ప్రభాస్ హానురాగవపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా క్లాసికల్ సినిమాలే కావడం జరుగుతుంది ఇదే జోరు కొనసాగిస్తే టాలీవుడ్ లో మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చక్రం తిప్పే అవకాశం ఉందని చెప్పవచ్చు.. మిక్కీ జేయర్ గోపి సుందర్ వంటి మ్యూజిక్ డైరెక్టర్ లాగా క్లాసికల్ మ్యూజిక్ను అందిస్తూ పలు రకాల క్రియేట్ చేస్తున్నారు హేషం అబ్దుల్ హవాబ్. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: