రవితేజ నటించిన ఆ ఎవర్గ్రీన్ మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ హీరోగా ఇడియట్ మూవీతో సూపర్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసగా రవితేజ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే రవితేజ మాస్ ఆడియన్స్ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


ఇది ఇలా ఉంటే రవితేజ కెరియర్ లో సూపర్ సక్సెస్ ను అందుకున్న సినిమాలలో వెంకీ మూవీ ఒకటి. ఈ మూవీ కి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి స్నేహ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమాలో ట్రైన్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూనే ఉన్నాయి. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.


అందులో భాగంగా రవితేజ కెరియర్ లో ఎవరి గ్రీన్ హిట్ గా నిలిచిపోయిన వెంకీ సినిమాను కూడా మరి కొన్ని రోజుల్లో 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రీ రిలీజ్ కోసం రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: