'బేబీ' మూవీ చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన రాశిఖన్నా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొబ్బరి మట్ట, హృదయ కాలేయం వంటి కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఈసారి లవ్ అండ్ ఎమోషన్స్ తో 'బేబీ' సినిమాను తెరకెక్కించారు. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత ఎస్ కే ఎన్ ఈ సినిమాని నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా దర్శకుడు సాయి రాజేష్ ఈ జనరేషన్ యూత్ లవ్ అనే పేరుతో ఎలాంటి పనులు చేస్తున్నారు, తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే అంశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. దీంతో యూత్ కి ఇప్పుడు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాని కొంతమంది ప్రేక్షకుల కోసం ఒకరోజు ముందుగానే అంటే జూలై 13న స్పెషల్ ప్రీమియర్స్ ని వేశారు. ఇక ఈ ప్రీమియర్స్ లో భాగంగా 'బేబీ' సినిమాను చూసేందుకు హీరోయిన్ రాశి ఖన్నా, విజయ్ దేవరకొండ తో కలిసి థియేటర్ కి వచ్చింది. ఈ ఇద్దరూ అలా కనిపించగానే థియేటర్లో ఫాన్స్ అరుపులు, కేకలతో తెగ సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా 'బేబీ' సినిమా చూసిన అనంతరం విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడుతూ..' సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, ఆనంద్, వైష్ణవి చాలా బాగా నటించారని, మొత్తానికి ఏడిపించేసారని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ తర్వాత రాశి ఖన్నా సైతం 'బేబీ' సినిమాపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ మేరకు రాసి ఖన్నా మాట్లాడుతూ.." బేబీ సినిమాలో చాలా మంచి లవ్ స్టోరీ ఉందని, సినిమాని చూస్తున్నంత సేపు నా కాలేజీ రోజులే గుర్తొచ్చాయి అని చెప్పారు. ఆనంద్, వైష్ణవి చాలా బాగా నటించారు. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని మన ఎస్ కే ఎన్ గారు ప్రొడ్యూస్ చేశారు. గ్రేట్ కంటెంట్ ని డెలివరీ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. నేను కూడా బేబీ మూవీ ప్రీమియర్స్ లో భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నా. అలాగే డైరెక్టర్ సాయి రాజేష్ కూడా సినిమాని బాగా తీశారు. మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చింది. సినిమాలో ప్రతి పాట చాలా బాగా నచ్చింది. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. థియేటర్స్ కి వెళ్లి అందరూ ఈ సినిమాని చూడండి" అంటూ చెప్పుకొచ్చింది రాశిఖన్నా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: