ఆ కారణంగా పాదయాత్ర కు సిద్ధం అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్....!!
ప్రస్తుతం దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ''లియో'' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూర్తి అయ్యిన ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా లో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉండగా విజయ్ పాలిటిక్స్ మీద తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.విజయ్ తమిళనాడులో పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాడు అని లియో సినిమా రిలీజ్ కు ముందే ఈ పాదయాత్ర ఉంటుందని అంటున్నారు. మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ పరంగానేనా లేదంటే లియో సినిమా కోసమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.కానీ ఈయన పాదయాత్ర చేస్తే రాజకీయం గా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఎప్పుడు పాదయాత్ర మొదలవ్వనుందో నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటే మాత్రం ఈయన గెలవడం ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడే రాకపోయినా ఈయన మెల్లమెల్లగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.