పెళ్లి గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సదా...!!
ఈమెతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం లోకి అడుగు పెట్టారు కానీ సదా మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అయితే తాజాగా కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం మరేది లేదు పెళ్లి చేసుకుంటే తనకు ఉన్నటువంటి ఫ్రీడం పోతుందని తెలిపారు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే తాను ఇలా సంతోషంగా ఉన్నానని ఈమె తెలిపారు.
ఇక ఈమెకు వైల్డ్ లైఫ్ అంటే ఎంతో ఇష్టమైన విషయం మనకు తెలిసిందే. అడవులకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జంతువులను క్యాప్చర్ చేస్తూ వైల్డ్ లైఫ్ ను ఎంతో ఇష్టపడుతుంటారు.అదే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కుదరవు మనల్ని అర్థం చేసుకున్న వారు వస్తే పరవాలేదు లేకపోతే కష్టం. ప్రస్తుత కాలంలో ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇలా పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం దేనికి అందుకే తాను కూడా పెళ్లి కి దూరం గా ఉన్నానని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ అవుతున్నాయి.