ప్రముఖ టాలీవుడ్ మరియు బాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఆమె నటించిన లాస్ట్ స్టోరీస్ టు విడుదలకు కొద్ది రోజుల ముందే తన ప్రియుడు విజయ వర్మతో తన ప్రేమాయణం గురించి అధికారికంగా వెల్లడించింది తమన్న. అయితే దాని తర్వాత ఆమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ రోజుల్లో ఆమె సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి జైలర్ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ సినిమా విడుదల కాబోతోంది దాని తర్వాత ఆగస్టు 11న అక్షయ్ కుమార్ ఓ ఎం జి టు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెండు సినిమాలకు గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా స్పష్టం అవుతుంది. ఈ క్రమంలోనే తమన్న మాట్లాడుతూ చాలామంది పెద్దదారులకు గట్టి పోటీని ఇచ్చి మరోసారి కొత్త స్థితిని సాధించింది తమన్నా. ఇకపోతే తమన్నా రాబోయే సినిమా జైలర్ నుండి కావాలా పాట విడుదలై ఎంతటి సెన్సేషన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ పాపులర్ అయింది. పాటలోని ట్యూన్ల నుండి తమన్నా డాన్స్ వరకు ప్రజలు ఎంతో ఇష్టంగా ఆ పాటని చూస్తున్నారు. ఈ క్రమంలోని తమన్నా ఆమె పాటలు ఆమె అభిమానులలో
ఆమెకున్న పాపులారిటీ కారణంగా తమన్న షారుఖ్ ఖాన్ వదిలి కొత్త స్థితిని సాధించింది అని చెప్పాలిమ్ మోస్ట్ ఫేవరెట్ సెలబ్రిటీల లిస్టులో తమన్న నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అయితే ఇటీవల ఐఎండిబి అత్యధికంగా ఇష్టపడిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే అందులో తమన్నా మొదటి స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుక్ ఖాన్ ను కూడా ఓడించింది తమన్నా ఎందరో స్టార్ హీరోలు హీరోయిన్ లో ఉన్న ఈ లిస్టులో తమన్నా అగ్రస్థానంలో ఉండడంతో తమన్నా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..!!