జాతిరత్నాలు హీరోయిన్ కి ఏమైంది.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది..!?

Anilkumar
జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే హైదరాబాద్ కి చెందిన ఈమె హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో మోడలింగ్ చేసింది. అనంతరం ఏం డైరెక్టర్ అనుదీప్ ఆమెకి జాతి రత్నాలు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక సినిమాతో తెలుగు తెలుగుతెరకి పరిచయం అయింది ఈ హీరోయిన్. నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించింది ఫరియా. ఇక జాతి రత్నాలు సినిమా ఏంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 

కామెడీ సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో చిట్టి పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమెని బయట ఎక్కడ చూసినా కూడా చిట్టి అనే పిలుస్తున్నారు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాతో ఈమెకి ఎంతటి గుర్తింపు వచ్చింది అనేది. అయితే ఇన్నోసెంట్ లాయర్ గా లవర్ గా ఈ సినిమాలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది ఫరియా. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆమెకి హీరోయిన్గా మాత్రం అవకాశాలు రావడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో కనిపించింది. హీరో పెళ్లిచూపులు చూడడానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తలుక్కున మెరిసింది ఈ చిన్నది.

దాని తరువాత బంగార్రాజు సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కనిపించింది. అనంతరం సంతోష్ శోభన్ కి జోడిగా లైక్ షేర్ సబ్స్క్రబ్ సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా కనీస ఆదరణ కూడా దక్కించుకోలేకపోయింది. అనంతరం రావణాసుర సినిమాలో హీరోయిన్గా కనిపించింది ఈమె. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ ట్రేల్లర్ సినిమా సైతం వరియా కి నిరాశే మిగిలింది. ఇక ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా వారి సదా డిజాస్టర్ గా మిగలడంతో ఈమెకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆమె తన సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన హాట్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంది. బోల్డ్ ఫోటోషూట్స్ చేసి అందరికీ షాక్ ఇస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: