మాస్ మహారాజ రవితేజ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. అందులో ధమాకా మూవీ మంచి విజయం సాధించగా ... మిగిలిన రెండు సినిమాలు అయినటువంటి ఖిలాడి ... రామారావు ఆన్ డ్యూటీ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... రావణాసుర అనే మూవీ లో సోలో హీరోగా నటించాడు.
ఇకపోతే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ... ఈగల్ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ ల షూటింగ్ లు కూడా ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్నాయి. ఇలా ఈ రెండు మూవీ లు సెట్స్ పై ఉండగానే రవితేజ ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ నెల తొమ్మిదవ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే రవితేజ మరో క్రేజీ దర్శకుడి మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన బింబిసారా మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఒక మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.