"టిల్లు స్క్వేర్" విడుదలకు మరి ఇన్ని కష్టాలా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజె టిల్లు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలా డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటుడు ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి సిద్దు ... అనుపమ కలిసి ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మొదట చిత్ర బృందం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ అనౌన్స్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ మూవీ ని ... రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ మూవీ ని ... అలాగే రన్బీర్ కపూర్ హీరో గా రూపొందుతున్న యానిమల్ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు ఆ మూవీ బృందాలు ప్రకటించాయి.  దానితో ఇల్లు స్క్వేర్ మూవీ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


ఆ తర్వాత ఇదే తేదీన రామ్ ... బోయపాటి కాంబోలో రూపొందుతున్న స్కంద మూవీ ని ... చంద్రముఖి 2 మూవీ ని ... మార్క్ అంటోనీ మూవీ ని కూడా అదే తేదీన విడుదల చేయనున్నట్లు ఆ మూవీ బృందాలు ప్రకటించాయి. దానితో టిల్లు స్క్వేర్ మూవీ బృందం ఈ సినిమాను మరోసారి వాయిదా వేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త కేవలం రూమర్ గా మిగిలిపోతుందా ... లేక టిల్లు స్క్వేర్ మూవీ బృందం మరో విడుదల తేదీని వెతుకుతుందా ... అనేది తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: