మళ్లీ 'క్రాక్' ఎక్కించడానికి రెడీ..!

shami
గోపీచంద్ మలినేని మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పండుగే. డాన్ శీను, బలుపు, క్రాక్ లతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ కాంబో మరో సినిమాకు సిద్ధమయ్యారు. క్రాక్ తర్వాత బాలకృష్ణతో వీర సిం హా రెడ్డి తో కూడా హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మరోసారి మాస్ రాజాతో తన మార్క్ మూవీకి సిద్ధమయ్యాడు. దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ లేటెస్ట్ గా వచ్చింది. గోపీచంద్, రవితేజ కాంబో సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.

ఆల్రెడీ వీర సిం హా రెడ్డి సినిమాను నిర్మించిన మైత్రి మేకర్స్ గోపీచంద్ లోని టాలెంట్ గుర్తించి అతనితో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఇక మాస్ మహరాజ్ తో గోపీచంద్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి మరో మాస్ ఫీస్ట్ పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తో ఒక ఫ్యాన్ రెక్కలు చూపిస్తూ పోస్టర్ వదిలారు చిత్ర యూనిట్. ఇక సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటిది జూలై 9న ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

సూపర్ హిట్ కాంబో మూవీ అంటే సూపర్ హిట్ వైబ్ క్రియేట్ అయినట్టే. అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. వీర సిం హా రెడ్డి తర్వాత గోపీచంద్ రవితేజతో సినిమా చేయడం మాస్ రాజాకి కూడా కలిసి వచ్చే అంశమే. మరి ఈ క్రాక్ కాంబో ఈసారి ఆడియన్స్ కి ఎలాంటి మాస్ ఫీస్ట్ అందిస్తారన్నది చూడాలి. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటుగా గోపీచంద్ మలినేని సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: