బాలయ్య ఖాతాలో మరొక అరుదైన గౌరవం..!?

Anilkumar
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఈయన సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోతూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ హీరోగా మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు బాలకృష్ణ. రాయలసీమలో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది ఆయనకి. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలు డిజాస్టర్ గా అనిపించినా కూడా రాయలసీమలో మాత్రం కళ్ళు చెదిరే స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఈ క్రమంలోనే ఇటీవల ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమాకి 175 రోజులు. అయితే బాలయ్య నటించిన ఘండా సినిమా సైతం థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించబడింది. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డర్ వచ్చి చేరుకుంది. అయితే కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ థియేటర్లో విరసింహారెడ్డి సినిమాని ఏకంగా 175 రోజులపాటు ప్రదర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇన్ని రోజుల వరకు ఏ స్టార్ హీరో సినిమాని ప్రదర్శించలేదు.

దాంతోపాటు సి సెంటర్ లో బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఇంతటి అరుదైన ఘనతను సాధించడంతో ఆయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమాలో సైతం రికార్డ్ స్థాయిలో వసూళ్లని రాబట్టాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. అయితే ఈ మధ్య హ్యాట్రిక్ విజయాలను బాలయ్య అందుకువడంలో కాస్త వెనకబడ్డాడు అని చెప్పాలి. అయితే తాజాగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. అయితే ఈ సినిమా కనుక విజయాన్ని అందుకుంటే ఒక హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో పడినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తప్పకుండా బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని అంటున్నారు ఆయన అభిమానులు. మొత్తానికి బాలకృష్ణ సిల్వర్ జూబ్లీ రికార్డ్ విషయంలో సీనియర్ స్టార్ హీరోలను నెంబర్ వన్ హీరోగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: