రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నితిన్.. మరి సినిమాలు..!?

Anilkumar
సినిమాలకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది. అయితే రాజకీయ నాయకులు సినిమాల్లో రాణించిన దాఖలు లేవు కానీ సినిమా రంగం నుండి వచ్చిన వారు చాలామంది ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఆ రూట్ లో యంగ్ హీరో నితిన్ కూడా వెళ్లబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా నితిన్ తో బిజెపి నేత జెపి నడ్డా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా అసలు లేకపోవడంతో బిజెపి నేతలు స్టార్ హీరోలను ఉత్తమ ప్రచారాలకు

 రమ్మని పిలవడానికి ఈ బేటీలు చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోని నితిన్ చాలా సున్నితంగా బిజెపికి ప్రచారం చేయడానికి ఇష్టం లేదు అంటూ చెప్పాడట. ఇక అప్పట్లో ఈ వార్తలు ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నితిన్ రాజకీయాల్లోకి రావడం వాస్తవమే కానీ ఆయన పోటీ చేయకుండా తన మేనమామ నగేష్ రెడ్డిని నిలబెట్టనున్నారంటూ తాజాగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే నగేష్ ఎప్పటినుండో కాంగ్రెస్లో ఉన్న సంగతి తెలిసిందే ఈ మధ్యనే ఆయన రేవంత్ రెడ్డితో సైతం భేటీ కూడా అయ్యారు. నితిన్ వాళ్ల సొంత ఊరు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్

 నుంచి నగేష్ నువ్వు పోటీ చేయించాలని నితిన్ ఇందుకోసం చాలా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికీ టికెట్ విషయం మై రేవంత్ రెడ్డి తో నగేష్ చర్చలు సైతం జరిపారట. అనంతరం సర్వేలను బట్టి టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నగేష్ కోసం నితిన్ ఇప్పుడు రంగంలోకి దిగాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే   టికెట్ కోసం నితిన్ చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే దీనిపై నితిన్ స్పందించాల్సి ఉంది. నితిన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: