పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇలా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడంపై ఎవరికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. దర్శక నిర్మాతలు అండర్స్టాండింగ్ తో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. అంతేకాదు ఆయన ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే షూటింగ్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాల విషయంలో వస్తుందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.
ఇక వరుసగా ఆ సినిమాలన్నిటిని రీ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. కానీ మొదట ఉన్న ఆసక్తి ఎప్పుడూ కనపరచడం లేదు ఫ్యాన్స్. ఇప్పుడు ఇలా వరుస పెట్టి అన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకి రిలీజ్ చేయడానికి ఆయన ఒక్క సినిమా కూడా మిగలదు. జల్సా తో మొదలైన ఈ సందడి ఖుషి తమ్ముడు తొలిప్రేమ బద్రి వంటి సినిమాలు రిలీస్ అవుతూ ముందుకు వెళుతూ ఉంది. ఇక జల్సా సినిమాకు ఎంతటి కలెక్షన్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని తర్వాత ఖుషి సినిమాకి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రావడం జరిగింది.
అయితే ఈ రెండు సినిమాలకి కలెక్షన్స్ బాగా వచ్చాయి కదా అని బద్రి తమ్ముడు వంటి సినిమాలను రీ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక వాటిని కనీసం పట్టించుకోలేదు కూడా జనాలు. అయితే మొన్నటికి మొన్న తొలిప్రేమ సినిమాని సైతం మళ్లీ రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం బోల్తా పడింది.ఈ సినిమా. అయితే ఇలా ఆయన సినిమాలని వరుసగా రిలీజ్ చేయడంతో ఆయన పాత సినిమాలపై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఆయన సినిమాలు మంచి కలెక్షన్స్ను రాబట్టకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని చూసి పవన్ అవమానపడడం తప్ప మరొకటి లేదు అని అందుకే ఇప్పటికే రీ రిలీజ్ సినిమాలను ఆపేస్తే మంచిది అని అంటున్నారు..!!