టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ పోయిన సంవత్సరం డీజే టిల్లు మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో ఈ నటుడు కి సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఇలా డిజె టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కాకపోతే అదే తేదీన అనేక సినిమాల విడుదల తేదీలు ఉండడంతో ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత అదే తేదీన మరి కొన్ని సినిమాలు విడుదల తేదీలను కూడా కొన్ని మూవీ బృందాలు ప్రకటించాయి. దానితో మరో సారి టిల్లు స్క్వేర్ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే డిజె టిల్లు మూవీ మంచి విజయం సాధించడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.