ఆ ఒక్క టీజర్ తోనే 'సలార్' మూవీ అంత బిజినెస్ చేసిందా...?
ఈ టీజర్ వచ్చిన తర్వాత టాలీవుడ్ విశ్లేషకులు సహా పలు అంతర్జాతీయ కథనాలు కూడా ఈ సినిమా బడ్జెట్ గురించి వరుస కథనాలు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా బుడెజ్ట్ అంశం కూడా వైరల్ గా మారింది. ఈ సినిమాను నీల్ 400 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు అనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అయ్యింది.. మరి కెజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 లకు కలిసి కూడా నీల్ ఇంత ఖర్చు చేయలేదు.. దీంతో సలార్ కోసం ఈసారి బాగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మేకర్స్ కూడా నీల్ ను నమ్మి ఆయన చెప్పినంత పెట్టినట్టు అనిపిస్తుంది. కాగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.