కొత్త యాడ్ లో మెరిసిన మెగా పవర్ స్టార్...!!

murali krishna
స్టార్ హీరోలు కూడా అడ్వర్టైజ్ లలో చేయటానికి ఏమాత్రం మొహమాటం పడటం లేదు. ఒక చిన్న యాక్షన్ లాగా చేసి లక్షలలో పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు పలు రకాల అడ్వర్టైజ్మెంట్లను చేశారు.ఇక రీసెంట్ గా ప్రభాస్ కూడా కారుకు సంబంధించిన యాడ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. అతి తాజాగా చరణ్ ఈసారి మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ యాడ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.యంగ్ హీరో నుండి గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. అలా రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా తీసాడు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్ని సినిమా లు పరాజయం అయిన కూడా సినిమా ఆఫర్ లు బాగానే వచ్చాయి.ఇక ఏడాది కిందట రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు అందుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన పదేళ్ల కిందట ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చాడు. ఇక ఆ పాపకు క్లిన్ కారా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇంతకాలం భార్య చుట్టూ ఉండి జాగ్రత్తలు తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఫ్రీ కావటంతో వచ్చిన ప్రాజెక్టులను చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా మరో కొత్త యాడ్ లో చేశాడు.మీషో కి సంబంధించిన ఈ యాడ్ లో ఒక జాకెట్ కోసం బాగా పర్ఫామెన్స్ చేశాడు. ఇక మీ షో యాప్ ను మరింత పైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ యాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.. ఆ వీడియో చూసిన తన ఫ్యాన్స్ ఇదెక్కడి మాస్ రా మావ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ యాడ్ కు రామ్ చరణ్ ఎంత పారితోషకం తీసుకున్నాడు తెలియదు కానీ గతంలో మాత్రం యాడ్స్ కు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ఇక ఇప్పుడు సినిమాల పరంగా కూడా బాగా బిజీగా అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: