సామజవరగమనా: అక్కడ వసూళ్ల సునామి?

Purushottham Vinay
టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక బోల్తా కొడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం పెద్ద హీరోలు కూడా సాధించని కొన్ని అరుదైన రికార్డ్స్ ని కూడా నెలకొల్పుతున్నాయి. అందుకు  ఉదాహరణే రీసెంట్ గా వచ్చిన శ్రీ విష్ణు హీరో గా నటించిన 'సామజవరగమనా' అనే చిత్రం. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ వచ్చింది.అయితే టాక్ కి తగ్గ వసూళ్లు మొదటి రెండు రోజులు రాలేదు కానీ. మూడవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఒక రేంజ్ లో పికప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ పుల్ వున్న ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని బాగా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.



ఈ మధ్య కాలం లో ఇలాంటి కలెక్షన్స్ అసలు ఏ సినిమాకి కూడా రాలేదు. ఇకపోతే అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ముఖ్యంగా  వర్కింగ్ డే నాడు ఈ చిత్రానికి అమెరికా లో వచ్చిన వసూళ్లు ఏకంగా 75 వేల డాలర్లు అట.ఇది గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి విడుదలైన పెద్ద స్టార్ హీరోల సినిమాల వసూళ్లకంటే కూడా ఈ సినిమా వసూళ్లు చాలా ఎక్కువే అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇంకా మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాలు వర్కింగ్ రోజు కేవలం 45 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసాయి. కానీ 'సామజవరగమనా' సినిమా మాత్రం ఏకంగా 75 వేల డాలర్లు రాబట్టింది అంటే, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఓవర్ సీస్ లో 30 లక్షలు బిజినెస్ చేస్తే దాదాపు 85 లక్షలు దాకా ఈ సినిమా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: