తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అలాంటి ఒక స్టార్ హీరో సినిమా అంటే కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే ఎంతో ఆసక్తిగా ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తెలుగులో సైతం ఆయనకి మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు ఆయన నటిస్తున్న లియో సినిమాకి ఏకంగా 22 కోట్లు మార్కెట్ ఏర్పడింది. దీంతోనే మనకు అర్థమవుతుంది ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. ఈ క్రమంలోనే లియో సినిమా తర్వాత విజయ్ ఏ సినిమా చేస్తాడు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.
అయితే ప్రస్తుతం ఆయన లోకేష్ పనగరాజ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ విజయ్ ఆయనే నమ్మి ఆయన తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక లియో సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా అక్టోబర్ నాటికి ఈ సినిమా విడుదల చేయాలని
ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే విజయ్ సినిమాలను దసరా సెలవులను టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఇండస్ట్రీలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అన్ని అనుకున్నట్లుగానే జరిగితే ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టడం ఖాయమని నమ్ముతున్నారు విజయ్ ఫ్యాన్స్. అయితే వెంకట్ ప్రభు తో సినిమా అయిపోయిన తర్వాత విజయ్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వెంకట్ ప్రభుత్వ సినిమా అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుండి మూడేళ్ల గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట విజయ్. అయితే తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి..!!