పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు తాజాగా "బ్రో" అనే మూవీ లో కలిసి నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నటుడు ... దర్శకుడు అయినటువంటి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో సాయి తేజ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరి కొన్ని రోజుల్లోనే మొత్తం పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే వకీల్ సాబ్ ... భీమ్లా నాయక్ లాంటి వరుస విజయాల తర్వాత పవన్ నటించిన మూవీ కావడం ... అలాగే ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి తేజ్ కూడా హీరో గా నటించడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 35 కోట్ల ప్లస్ , ఆంధ్ర ఏరియాలో 40 కోట్ల ప్లస్ , ఓవర్ సీస్ లో 13 కోట్లు , సీడెడ్ ఏరియాలో 14 కోట్ల ప్లస్ , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 ప్లస్ కోట్లు మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల ప్లస్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా బ్రో మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.