తరుణ్ భాస్కర్ ని మెచ్చుకుంటున్న నెటిజన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'పెళ్లిచూపులు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ యంగ్ డైరెక్టర్ తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత  'ఈ నగరానికి ఏమైంది' సినిమాని తెరకెక్కించి యూత్ హృదయాలను ఆకట్టుకున్నారు. అయితే ఇది కమర్షియల్ గా అంతగా సక్సెస్ మాత్రం కాలేదు.ఇక ఆ సినిమాతో డైరెక్షన్ స్టాప్ చేసి నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. అవి బాగా గుర్తింపు తెచ్చాయి.ఇక ఐదేళ్ల తర్వాత రీసెంట్ గా మెగాఫోన్ పట్టుకుని ఓ సినిమాను ప్రకటించారు. దానికి సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు. అదే 'కీడా కోలా'. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రం కూడా చాలా ఇంట్రెస్టింగా సా సాగింది. ఇందులో లెజెండరి కమెడియన్ టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా కీలక పాత్ర పోషించారు.అందువల్ల సినీ ప్రియులు ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా తాజాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అయితే అక్కడ ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.



ఇక అదేంటంటే.. ఎందుకు మీరు స్టార్ అండ్ టాప్ హీరోస్ తో కలిసి పనిచేయరని. అయితే దానికి ఆయన తనదైన స్టైల్ లో వాస్తవాన్నే చెప్పారు. "నాకు తెలుసు మేము ఆడిషన్ చేసి తీసుకునే హీరోస్ కు మార్కెట్ వ్యాల్యూ ఉండదు. ఇక మేము కుక్క సావు చస్తుంటాం ఓ సినిమాను మార్కెట్ చెయ్యడానికి.అయితే ఓ స్టార్ స్టేటస్ ఉన్న హీరో అయితే కొన్ని సీన్స్ చెయ్యలేరు. ఇంకా కొన్ని సినిమాలూ చెయ్యలేరు. అవి అభిమానులకు తగ్గటు ఖచ్చితంగా మార్చాలి. ఒక భిన్నమైన కథ రాసినప్పుడు.. అది కొత్త వాళ్ళతో చెయ్యడానికి మాత్రమే సాధ్యం అవుతుంది" అని అన్నారు. ఇక ఈ కామెంట్ల్ విన్నవారు అయితే ఇదీ నిజమే అని అంటున్నారు. ఆయన కీడా కోలా సినిమా మంచిగా ఆడాలని హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు.కొంతమంది నెటిజన్స్ మాత్రం తరుణ్ భాస్కర్ ని మెచ్చుకుంటున్నారు. రెండు సినిమాలు డైరెక్ట్ చేసి ఇంకా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాక కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలని కాకుండా కథను నమ్ముకునే కొద్దిమంది డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ కూడా ఒకడని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: