మెగా డాటర్ నిహారిక కొణిదెల జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎట్టకేలకు వీరిద్దరి బంధం అధికారికంగా విడాకులతో ముగిసింది. అయితే గతకొంత కాలంగా వీరిద్దరూ జంటగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంతేకాదు ఒకరి ఫోటోలని ఒకరు సోషల్ మీడియాలో డిలీట్ సైతం చేసుకున్నారు. దీంతో అప్పటినుండి వీరిద్దరిపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అనంతరం చైతన్య మరియు నిహారిక ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్ సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావడం స్టార్ట్ అయ్యాయి.
కానీ దీనిపై అటు మెగా ఫ్యామిలీ గాని ఇటు చైతన్య ఫ్యామిలీ కానీ ఎప్పుడూ కూడా స్పందించింది లేదు. అయితే తాజాగా కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరూ మ్యూచువల్గా విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిహారిక చైతన్య ఇద్దరిలో ఎవరు ముందుగా డివోర్స్ కోరుకున్నారు అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది అని చెప్పాలి. అయితే వీరిద్దరూ కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం ముందుగా నాగచైతన్య విడాకులు దరఖాస్తు చేసినట్లుగా సమాచారం. నిహారిక విడాకుల వ్యవహారం అభిమానులకు ఎంతో షాకింగ్ గా మారింది. అయితే నిహారిక తరఫున పిటిషన్ వేసిన లాయర్ గురించి
సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక తరఫున పిటిషన్ వేసిన లాయర్ మరెవరో కాదు పవన్ కళ్యాణ్ కి అభిమానిగా జనసేన మద్దతుదారుడుగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర. ఇక ఆ పిటిషన్ లో ఆయన పేరు ఉంది అయితే కళ్యాణ్ దిలీప్ నాగబాబుకి చాలా క్లోజ్ గా ఉంటాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు ఏంటి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి ఇక్కడ కారణం ఏంటి అన్న చర్చలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నప్పటికీ ఆ విషయాలను అన్నిటిని చాలా గోపియంగా ఉంచారు మెగా ఫ్యామిలీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక నటిగా రాణిస్తుండగా చైతన్యతను వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. అయితే వీరిద్దరి వివాహం 2020లో చాలా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ..!!