మళ్లీ పెళ్లి ఓటిటి స్ట్రీమింగ్ నిలిపివేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా మళ్లీ పెళ్లిమ్ అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది అన్న సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటితో పాటు అమెజాన్ ప్రైమ్ లో సైతం విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం మళ్లీ పెళ్లి సినిమా ఆహా ఓటీటిలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీపీ ప్లాట్ఫారం నుండి ఈ సినిమాని తొలగించిందట. లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లుగా సమాచారం వినబడుతోంది. 

అయితే తన పరువుకు భంగం కలిగించేలా మళ్లీ పెళ్లి సినిమా ఉంది అని ఓటిటి స్ట్రీమింగ్ ఆపివేయాలి అంటూ నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఓటీటి ప్లాట్ఫారం నుండి అమెజాన్ ప్రైమ్ తొలగించిందట. తెలుగుతోపాటు కన్నడ స్ట్రీమింగ్ ని సైతం ఆపివేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని నరేష్ మరియు పవిత్ర లోకేష్ నిజజీవితంలో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. ఇక ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతోనే ఈ సినిమాపై ఇంతలా క్రేజ్ పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఈ సినిమా మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ థియేటర్లలో మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఎలా రిటేషన్ షిప్ లోకి వచ్చారు అన్న అంశంతో ఈ సినిమాని దర్శకుడు ఎంఎస్ రాజు విజయ్ కృష్ణ మూవీ బ్యానర్ పై నరేష్ తానే స్వయంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాలో వనిత విజయ్ కుమార్ , శరత్ బాబు మరియు జయసుధ ముఖ్య పాత్రులు పోషించడం జరిగింది. అయితే ఈ కథ అందరికీ తెలిసిన కథే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో అంతగా ఇష్టంగా చూడలేకపోయారు. కానీ ఓటీటిలో మాత్రం ఈ సినిమా మంచి ఆదరణను పొందింది. అంతేకాదు మంచి వ్యూస్ ని సైతం రాబట్టింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: