సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ నటించిన సూపర్ హిట్ మూవీ లలో బిజినెస్ మాన్ మూవీ ఒకటి.
ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... మహేశ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కంటే ముందే మహేష్ ... పూరి కాంబినేషన్ లో పోకిరి మూవీ రూపొంది అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను ఈ మూవీ తుడిచి పెట్టేసింది. దానితో వీరి కాంబినేషన్ లో రెండవ మూవీ గా రూపొందిన బిజినెస్ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అచనాల నడుమ ఈ సినిమా 2012 వ సంవత్సరం జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.
ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో 4 కే వర్షన్ తో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.