ఆస్కార్ రేసులో ఎంట్రీ ఇస్తున్న విక్రమ్ తంగళన్..!!
ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తున్నది. ఇదంతా ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు సాధించడమే లక్ష్యంగా చిత్ర బృందం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ తో సహా మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొనే లక్ష్యంతోని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నామని తాజాగా ప్రొడ్యూసర్ ధనంజయ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.
తంగళన్ సినిమాకి ఆస్కార్ తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ కేవలం మరో పది రోజుల్లో పూర్తి అవుతుందని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో తంగళన్ చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్ లో స్కిన్నింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు ఆస్కార్ రేసులో ఈ సినిమా నిలవడం ఖాయం అనిపిస్తోందంటూ కూడా తన అభిప్రాయంగా తెలియజేశారు.2D,3D వర్షన్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.