బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

Anilkumar
టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో కనీసం ఒక సినిమాలో అయినా నటించాలని ఎదురు చూస్తారు దర్శకులు, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు. అలాంటి నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటించేందుకు పోటీపడేవారు అని చెప్పాలి. అప్పట్లో ఆయన అందంలో ముందు వరుసలో ఉండేవారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యను చచ్చిన సినిమాను చేయను అని ఆయన ముఖం మీద చెప్పేసిందట. 

ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సౌందర్య. అసలు విషయం ఏంటంటే .. బాలయ్యతో గతంలో టాప్ హీరో నర్తనశాల అనే రెండు సినిమాల్లో నటించింది సౌందర్య. చెన్నకేశవరెడ్డి సినిమా లో టబు పాత్ర కోసం ముందుగా సౌందర్యని తీసుకోవాలని అనుకున్నారట దర్శక నిర్మాతలు. ఇక అది బాలయ్య కి తల్లిపాత్ర అవుతుంది.. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్లో నటించారు. తండ్రి కొడుకు పాత్రలో నటించారు బాలయ్య. తండ్రి పాత్రకు జోడిగా టబు కొడుకు పాత్రకు జోడిగా శ్రీయను అనుకున్నారు.తండ్రి పాత్రలో బాలయ్య కి జోడిగా సౌందర్య నటిస్తే  బాగుంటదని అనుకున్నారు..

అంటే బాలయ్యకు తల్లి పాత్ర కూడా అవుతుంది.  బాలయ్యకు తల్లిగా నటించడం అంటే తనకి ఇష్టం లేదు అని.. సౌందర్య   తన ముఖం మీద చెప్పేసిందట. అంతేకాదు బాలయ్య పక్కన హీరోయిన్ అవకాశం వస్తే చేస్తాను అని కానీ తల్లిగా మాత్రం అసలు చేయను అని.. కనీసం దాన్ని ఊహించుకోలేను అని..బాలయ్య మీద తనకి ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది సౌందర్య. దాంతో చేసేదేమీ లేక టబు ని ఈ సినిమాలో తీసుకున్నారట. ఇక అప్పట్లో ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ రీసెంట్గా రీ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో నందమూరి బాలకృష్ణ మరియు హీరోయిన్ సౌందర్య కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: