టాలీవుడ్ నటుడు
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన
రాణా ప్రస్తుతం సోలోగా హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈయన నటించిన విరాటపర్వం
సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ మల్టీ స్టార్ సినిమాలు మాత్రం రానాకి భారీ విజయాన్ని .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన భీమ్లా
నాయక్ సినిమాలో ఈయన పాత్ర ఎంత అద్భుతంగా మెరిసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇటీవల
రానా నాయుడు వెబ్ సిరీస్ తో అలరించాడు రానా. ఇక ఈ బోల్డ్ సిరీస్ లో
వెంకటేష్ రాణా తండ్రి పాత్రలో కనిపించాడు. ఇక
రానా నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంది.
కానీ విమర్శలతో కూడా భారీ వ్యూస్ ని అందుకుంది
రానా నాయుడు సీరియస్. అయితే తాజాగా
రానా స్పై సినిమాలో సైతం మెరిసారు. ఇక ఈ
సినిమా ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో టాలెంటెడ్
హీరో నిఖిల్ మరియు
ఐశ్వర్య మీనన్ జంటగా కనిపించారు.
ఆర్యన్ రాజేష్ అభినవ్ గోమటం సచిన్ ఖేడేకర్ మరియు
రానా దగ్గుపాటితోపాటు చాలామంది నటీనటి లో కొన్ని ముఖ్య పాత్రలు పోషించారు. నిఖిల్ నటించిన ఈ
సినిమా ట్రైలర్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు
సినిమా హిట్ అవుతుందని మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ
సినిమా అంచనాలను అందుకోవడంతో విఫలమైంది అని చెప్పొచ్చు.
జూన్ 29న విడుదలైన ఈ
సినిమా ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే నిఖిల్ నటించిన ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు రానా. ఆయన పాత్ర
సినిమా చివరిలో కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్లో
రానా ఎంటైర్ సుభాష్
చంద్రబోస్ మరణం గురించి ఏదో థియరీ లాంటిది చెప్పడం మనం చూసాం. ఆయన పాత్ర నిడివి కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండదు. అయినప్పటికీ దీనికోసం
రానా తీసుకున్న రెమ్యూనరేషన్ కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ లో మారింది. అయితే స్పై
సినిమా కోసం
రానా ఏకంగా 40 లక్షలును తీసుకున్నాడు అన్న ప్రచారం సోషల్
మీడియా వేదికగా జరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఒక్క నిమిషం కోసం 40 లక్షలు తీసుకున్నాడా అంటూ షాక్ అవుతున్నారు ..!!