రామ్ - పూరీ కాంబో సినిమా.. బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే..?
పూరి జగన్నాధకు అవకాశం ఇవ్వడానికి హీరోలు నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు పూరి జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా థియేటర్లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. గతంలో రామ్ ,బోయపాటి కాంబినేషన్లో కూడ ఒక చిత్రం రాబోతున్నది. ప్రస్తుతం హీరో రామ్ తన చిత్రాలన్నీ కూడా స్టార్ డైరెక్టర్లతోనే దర్శకత్వం వహిస్తున్నారు.
హీరో రామ్ ఒక చిత్రానికి రూ .15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథ పైన ప్రత్యేక దృష్టి పెట్టలని ఫాన్స్ కోరుకుంటున్నారు.పూరి జగన్నాథ్ మళ్లీ రూ.40 కోట్ల రూపాయలతో సినిమా నిర్మిస్తూ ఉండడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్ప వచ్చు. పూరిని అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి మంచి విజయాలని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.