టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హాటెస్ట్ బ్యూటీలలో పాయల్ రాజ్పుత్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈనటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ దక్కడం మాత్రమే కాకుండా మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈనటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మాయా పేటికా అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా జూన్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి మంగళవారం అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ యొక్క టీజర్ ను జూలై 4 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ టీజర్ విడుదలకు సంబంధించి ప్రకటించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.