కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా చంద్రముఖి 2. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. దాదాపు 18 ఏళ్ల క్రితం లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు చంద్రముఖి 2 సినిమా రాబోతోంది. హారర్ జోన్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. దింతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో హీరోగా రాఘవ లారెన్స్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తనదైన గుర్తింపును తెచ్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సీనియర్ డైరెక్టర్ పి వాసు ఈ సినిమాని తీస్తున్నారు. చంద్రముఖి సినిమా విడుదలై దాదాపుగా 18 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూస్తారు సినీ లవర్స్. ఇక అప్పట్లోనే ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయన 65వ సినిమా. అంతేకాదు ఎక్కడ రాజీ పడకుండా లైకా ప్రొడక్షన్స్ శుభాష్కర అని చంద్రముఖి 2 సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!