భారతీయుడు-2 విడుదల తేదీ వాయిదా..!!

Divya
డైరెక్టర్ శంకర్, కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్-2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎన్నోసార్లు షూటింగ్ ఆగిపోవడం జరుగుతూనే వస్తోంది. గతంలో శంకర్ ,కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ అన్నట్లుగా తెలుస్తోంది. కమలహాసన్ ప్రేమేయంతో శంకర్ ఈ సినిమాని మళ్లీ సెట్స్ మీదికి తీసుకురావడం జరిగిందట. చివరిగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ సక్సెస్ బాట పట్టడంతో ఇండియన్-2 చిత్రాన్ని కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు.
ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.అయితే ఈ సినిమా విడుదల గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక అప్డేట్ వచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం లేదట. ఎందుచేత అంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన కూడా ఈ చిత్రానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్ పనులు చాలా బ్యాలెన్స్ ఉన్నట్లుగా సమాచారం.

దీంతో భారతీయుడు-2 సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోకి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై ఒకసారిగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తున్నది. మరి ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.. డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో కూడా గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. కేవలం మీ సినిమా షూటింగ్ కొద్ది భాగమే మిగిలినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయుడు-2 , గేమ్ చేంజెస్ సినిమాలు శంకర్కు ఏ విధంగా సహాయపడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: