తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు ఆఖరుగా అల్లూరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఇలా అల్లూరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ హీరో తాజాగా సామజవరగమన అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 29 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను కొన్ని థియేటర్ లలో ఈ మూవీ మేకర్స్ ప్రదర్శించగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 3.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగబోతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.
మరి సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో ఫ్యామిలీ సెంటిమెంట్స్ ... కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది.