స్పై: వావ్.. నిఖిల్ కేరీర్లోనే హైయెస్ట్ అట?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ' స్పై ' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఎడిటర్ గ్యారీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీగా అంచనాలు అనేవి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కానుందో వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా మొత్తం 1605కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. నైజాంలో 235కు పైగా సీడెడ్ లో 120కు పైగా ఆంధ్రాలో 280కు పైగా థియేటరలలో విడుదల అవ్వనునట్లు సమాచారం తెలుస్తోంది.మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కలిపి 635కి పైగా థియేటర్స్ లో ఈ మూవీ సందడి చేయనుంది.


ఇంకా అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర భాషల్లో కలిపి మొత్తం 550కు పైగా థియేటర్లలో ప్రదర్శన కానుందట.అలాగే ఓవర్సీస్ లో 420కు పైగా థియేటర్లలో అని సమాచారం తెలుస్తుంది. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1605కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుందని తెలిసింది. ఇక అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ మార్కెట్ కూడా బాగానే పెరిగింది. దీంతో స్పై సినిమాకు థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగినట్లు సమాచారం తెలుస్తుంది.అలాగే థియేటర్ హక్కులను రూ.18కోట్ల దాకా విక్రయించినట్టు సమాచారం అందింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ.18.50 కోట్లు.ఇక నిఖిల్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఆంధ్రాలో రూ. 6 కోట్లు నైజాంలో రూ. 5 కోట్లు సీడెడ్ రూ.2 కోట్లు ఇంకా ఓవర్సీస్లో రూ.1.75కోట్లు అలాగే ఇతర రాష్ట్రాలు రూ.70 లక్షలకు అమ్మారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: