సురేఖ వాణి సినీ కెరియర్ నాశనం కావడానికి కారణం ఆ స్టార్ హీరోనా..!?

Anilkumar
సీనియర్ నటి సురేఖ వాణి పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అని చెప్పాలి. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దానికి కారణం నిర్మాత kp చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి మరియు అషు రెడ్డి జ్యోతి వంటి వారి పేర్లు ప్రముఖంగా నేర్పిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే డ్రగ్స్ కేసులోకి ఏపీ చౌదరి దొరికాడు అప్పటినుండి వీరి పేర్లు మరింత ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సురేఖ వాణి కెపి చౌదరితో ఒక పబ్లిక్ ఏరియా లో ముద్దు పెట్టడంతో ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

అయితే ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆమె డ్రగ్స్ తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే సురేఖవాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన ఈమె ఫిమేల్ యాక్టర్ ఆర్టిస్ట్ గా అక్క వదిన అత్త అమ్మ పాత్రలో నటిస్తోంది. ఇక అలాంటి సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీగా కనిపించి అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన కూతురితో పొట్టి పొట్టి బట్టలు వేస్తూ నెగిటివిటీని అందుకుంటుంది. దాంతో ఈమెకి సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఈమెకి ఇలా వరుస అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం వెనక ఒక కారణం ఉందని అంటున్నారు.

అయితే ఆమెకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం మాస్  మహారాజా రవితేజ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవితేజ నటించిన సినిమాలతోనే సురేఖ వాణి ఎక్కువగా ఫేమస్ అయింది అని చెప్పాలి. రవితేజ సినిమాల్లో చాలా వరకు సురేఖవాణి నటించింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల్లో నటించే సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయన్న వార్తలు వినిపించాయి. దీంతోనే ఆ సినిమా తర్వాత నుండి ఈమెకు సినిమాలో అవకాశాలు రావడం తగ్గాయని తెలుస్తోంది. అయితే దీనికి కారణం రవితేజ అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: