ఆ నెల సెంటిమెంట్ నానికి మరోసారి వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఆఖరిగా ఈ నటుడు దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ.అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని ... శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నాని కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాని కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి "ఎంసీఏ" సినిమా కూడా డిసెంబర్ 21 వ తేదీన విడుదల అయింది.


అలాగే నాని కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24 వ తేదీన విడుదల అయింది. ఇలా ఇప్పటికే డిసెంబర్ నెలలో విడుదల అయిన రెండు సినిమా లతో మంచి విజయాలను అందుకున్న నాని మరి ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇకపోతే నాని కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: