బిచ్చగాడు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బిచ్చగాడు సినిమా కంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేదు. బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటుడు ఆ తర్వాత నుండి తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా బిచ్చగాడు రేంజ్ విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయాయి.
ఇది ఇలా ఉంటే బిచ్చగాడు మూవీ సూపర్ సక్సెస్ కావడంతో తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 అనే మూవీ ని తలకెక్కించాడు. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించగా ... కావ్య తప్పర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన బిచ్చగాడు 2 మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ప్రస్తుతం హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది.
తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీ అనౌన్స్మెంట్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 05 నిమిషాలకు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో రితికా సింగ్ ... మీనాక్షి చౌదరి లు ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... బాలాజీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.