పవన్ కళ్యాణ్ కు జోష్ ను ఇచ్చిన మహేష్ అభిమాని సాహసం !
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రకు కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాకుండా మిగతా హీరోల అభిమానులు కూడ వస్తున్నారు అని తెలియచేసే ఒక ఆశక్తికర సంఘటన గోదావరి జిల్లాలలో జరిగినది. పవన్ వారాహి రథం ఎక్కి ఉపన్యాసం చేస్తున్న ప్రాంతానికి మహేష్ వీరాభిమాని ఒకడు చేతులో పెట్టుకుని అందరూ చూసే విధంగా డిజైన్ చేసుకున్న ఒక ప్లకార్డ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
‘నేను మహేష్ వీరాభిమానిని అయితే నా ఓటు మాత్రం ‘జనసేన’ కే అంటూ ఆ ప్లకార్డ్ లో ఒకవైపు మహేష్ మరొక వైపు పవన్ మధ్యలో ‘జనసేన’ గ్లాస్ గుర్తుతో డిజైన్ చేయబడ్డ ఆ ప్లకార్డ్ మీడియా వర్గాలను కూడ విపరీతంగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మిగతా టాప్ హీరోల అభిమానులు అంతా పవన్ కళ్యాణ్ వైపు రానున్న ఎన్నికలలో సపోర్ట్ చేస్తే ఫలితాలు తారుమారు అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సమావేశాలకు దూరంగా ఉండే మహిళలు కూడ పవన్ సమావేశాలకు వస్తున్న పరిస్థితులలో గోదావరి జిల్లాలలో పవన్ కు పడే ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే ఎలాంటి అవినీతి లేని పాలనను అందిస్తాను అని చెపుతున్న పరిస్థితులలో ప్రజలు ఇప్పటికే అలవాటుపడిపోయిన ఉచిత పదకాలను వద్దనుకుని ఎంతవరకు పవన్ మాటలను నమ్ముతారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..