టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ ... థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే ను అందించగా ... సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
ఇలా విరూపాక్ష మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న సాయి తేజ ప్రస్తుతం "బ్రో" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో సాయి తేజ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చేయబోయే సినిమాను ఇప్పటికే యువ హీరో ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువ హీరో తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి అయినటు వంటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.