ఫస్ట్ కిస్ నాతోనేనట.. తమన్న చెప్పింది : విజయ్ వర్మ
అయితే మిల్కీ బ్యూటీ తమన్న 17 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక్కసారి కూడా మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలలో నటించలేదు అని చెప్పాలి. కొన్ని సినిమాల్లో కాస్త చిన్నచిన్న బట్టలు వేసినప్పటికీ ఇక రొమాంటిక్ సన్నివేశాల విషయంలో మాత్రం కాస్త లిమిట్స్ పెట్టుకుంది. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలలో ఒక్కసారి కూడా నటించలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు 17 ఏళ్ల సినీ ప్రయాణంలో తొలిసారిగా ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధమైంది ఈ సొగసరి.. అది కూడా వేరే హీరోకి కాదు ఏకంగా తన ప్రియుడు విజయ్ వర్మతో లిప్ లాక్ సన్నివేశాలకు ఓకే చెప్పింది అని చెప్పాలి.
తమన్నా, విజయ్ వర్మ సహ మరి కొంతమంది భారీ తారాగణం కలిగిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ వర్మ ప్రేయసి పాత్రలో నటించింది. తమన్న ఇక ఈ సినిమాలో నటించిన సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయింది. వీరిద్దరూ ప్రస్తుతం నిజంగానే డేటింగ్ లో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల తమన్నా ఒక ఆసక్తికర విషయాన్ని తనతో పంచుకుంది అంటూ విజయవర్మ చెప్పుకొచ్చాడు. ఆన్ స్క్రీన్ లో నేను కిస్ చేయబోతున్న మొదటి వ్యక్తి నువ్వే అని తమన్నా తనతో చెప్పిందని.. అందుకు బదులుగా తాను థాంక్యు అని చెప్పాను అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.