
బాలయ్య.. రవితేజకు.. లియో దెబ్బపడేనా..?
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఈ ఏడాది దసరాకి విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇందులో కీలకమైన పాత్రలో అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా నటిస్తోంది. అయితే ఇదంతా బాగున్నప్పటికీ దసరాకి బాలయ్య రవితేజ మధ్య గట్టి పోటీ పడనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలు విడుదల అవుతూ ఉండడంతో ఎక్కువగా అన్ని భాషలలో కూడా పలు చిత్రాలను విడుదల చేస్తున్నారు సినీ నిర్మాతలు.
అయితే ఇప్పుడు కోలీవుడ్లో ఫ్లాప్స్ లేని డైరెక్టర్ గా పేరు పొందిన లోకేష్ కనకరాజు తెరకెక్కించిన లియో సినిమాని దసరాకి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దళపతి నటిస్తున్నారు హీరోయిన్గా త్రిష నటిస్తున్నది. ఈ సినిమా తెలుగు రైట్స్ రూ.25 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే లియో సినిమాకే మంచి క్రేజ్ లభిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా డైరెక్టర్ వల్ల ఈ సినిమాకి క్రేజీ ఏర్పడిందని తెలుగు రాష్ట్రాలలో ఇంతటి బిజినెస్ జరగడం వల్ల ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడిందని సమాచారం.