తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ బృందం ఈ మూవీ.కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీbని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి "నా రెడీ" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను విడుదల చేసిన 24 గంటల సమయం లోనే ఈ సాంగ్ కు 16.55 మిలియన్ న్యూస్ ... 1.60 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే లియో మూవీ లోని మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.